More

200 రాజకీయ పార్టీలకు షాక్‌?

21 Dec, 2016 11:59 IST
200 రాజకీయ పార్టీలకు షాక్‌?

బ్లాక్మనీ కార్యకలాపాలపై కఠినచర్యలలో భాగంగా 200 రాజకీయ పార్టీలపై వేటువేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి ఎన్నికల సంఘం త్వరలోనే లేఖ రాయనుంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఈ 200 పార్టీలను డీలిస్టు చేయాలని సీబీడీటీకి పిలుపునిచ్చింది. ఎన్నికల సీజన్లో రాజకీయ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నప్పటి నుంచి ఈ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలని సీబీడీటీని కోరింది. దీంతో బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీగా అవతారమెత్తాలని భావించేవారికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తూ సీబీటీడీ వాటిని గట్టిగా హెచ్చరిస్తుందని ఎన్నికల సంఘం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
 
పార్టీలకు వెల్లువెత్తే విరాళాలు, వారు వెచ్చిస్తున్న సొమ్ముపై పారదర్శకత కోసం ప్రస్తుత చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి కేవలం రాజకీయ పార్టీలను నమోదు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి కల్పించిన స్వాభావిక అధికారాలతో అన్ని ఎన్నికల ప్రవర్తనలను అది నియంత్రిస్తోంది. కానీ పార్టీలను డీలిస్టు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇంకా కల్పించలేదు. సీరియస్గా లేని రాజకీయ పార్టీలను డీలిస్టు చేసే అధికారం తమకు కల్పించాలని చాలాసార్లు ఎన్నికల సంఘం గత ప్రభుత్వాలను పలుమార్లు కోరింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేదు. రూ. 20 వేల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందితే,  అందించిన వారి వివరాలను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కాపీని ఆదాయపు పన్ను శాఖ ప్రతియేటా ఎన్నికల సంఘానికి పంపుతుంది. అయితే చాలా పార్టీలు తమకు రూ.20వేల కంటే ఎక్కువగా అందే విరాళాల వివరాలనే అందించడం లేదు. దీంతో పార్టీ విరాళాల్లో కూడా పారదర్శకత తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..