More

మేడపైనే వరి సాగు!

12 Jan, 2016 00:06 IST
మేడపైనే వరి సాగు!

మేడపైన ఖాళీ స్థలంలో కూరగాయలు, పండ్లు పండించడం చూశాం. కానీ, ఏకంగా వరిని కూడా సాగు చేయొచ్చని నిరూపించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భగీరథీ బిసాయి (73). భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.)లో పనిచేసి 2014లో రిటైరైన భగీరథీ మహాసముంద్ జిల్లాలోని తన స్వగ్రామం నయాపురలో నివాసం ఉంటున్నారు. ఆయనకు సొంత భూమి లేదు. తన రెండంతస్తుల నివాస భవనం పైన ఖాళీ స్థలంలో ఆరు అంగుళాల మందాన మట్టి పోసి పొలంగా మార్చేశాడు.

తొలుత వంద అడుగుల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా వరి సాగు చేసి సఫలీకృతుడయ్యాడు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు 3 వేల అడుగుల స్థలంలో వరి సాగు చేసి, ఇటీవలే నూర్పిడి చేశాడు. ఆలోచన ఉంటే... ఇంటి పైనే వరి పండుతుంది..!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం..

Mushroom Omelette: మష్రూమ్స్‌ ఆమ్లెట్‌.. వేయడం చాలా ఈజీ!

రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్‌ మామూలుగా ఉండదు!

సగ్గు బియ్యం పరాఠా.. ఈజీగా చేసేస్తారా!

Rajasthani Onion Kachori: రాజస్థానీ ఉల్లి కచోరీ