More

ఏపీ: రెండు రోజులు వర్షాలే..

15 Jul, 2021 08:34 IST

సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్‌కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపాదడపాగా వానలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ. మధ్య విస్తరించి ఉంది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల (గురు, శుక్రవారాలు) పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మీరు మాత్రం వందల కోట్లు దోచుకోవచ్చా?

విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి

అర్హత ఉన్న వారికి పథకం ఆగిందా? బాబు, పవన్‌కు సజ్జల సవాల్‌

గడువులోగా అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్‌

త్వరలో 1.47 లక్షల మందికి ఉపాధి.. ఎలాగంటే..?