More

గజ ఈతగాళ్లను మరిపించారు!

3 Aug, 2020 10:25 IST
చెరువులో ఈత కొడుతున్న దృశ్యం

డోన్‌ టౌన్‌: కర్నూలు జిల్లాలో అతిపెద్ద చెరువుల్లో ఒకటైన డోన్‌ మండల పరిధిలోని వెంకటాపురం తుమ్మల చెరువులో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈతకొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ చెరువుకు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ చెరువును వెంకటాపురం గ్రామానికి చెందిన మేడబోయిన మధు, బద్దల కిట్టు, చిట్యాల బోయ హరికృష్ణ ఈదారు. మొదట మధు ఒకటిన్నర గంటలో ఈదగా.. కిట్టు, హరికృష్ణ  రెండు గంటల్లో లక్ష్యాన్ని     అధిగమించారు. ఇదే సమయంలో ఇంకొకరు ఈత కొట్టేందుకు సిద్ధం కాగా..  విషయం తెలుసుకున్న డోన్‌ రూరల్‌ ఎస్‌ఐ మధుసూదనరావు అక్కడికి చేరుకుని అతన్ని వారించారు. అలాగే అక్కడ గుమికూడిన ప్రజలను వెనక్కి పంపేశారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్‌