More

ఆనంద్‌ మహీంద్రా చెప్పిన బిజినెస్‌ పాఠం!

12 Oct, 2021 16:28 IST

మహీంద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్ వేదికగా వ్యాపారంలో రాణించాలనుకునే వారికి కీలకమైన సలహా ఇచ్చారు. ఓ ట్విట్టర్‌ యూజర్‌ ట్వీట్‌ చేసిన వీడియోను రీట్వీట్‌ చేస్తూ ఓ వ్యాపార నైపుణ్యాన్ని ఆయన వివరించారు. 

ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేసిన వీడియోలో.. ఓ కుక్క తన ముందు ఉన్న తలుపుకి అద్దం లేకపోయినప్పటికీ .. అక్కడ తాను ముందుకు వెళ్లేందుకు ఏదో అడ్డం ఉందనే భ్రమలో అక్కడే తచ్చాడుతూ ఉంటుంది. కొద్ది సేపటి తర్వాత ఆ కుక్క పక్కన ఉన్న మనిషి తలుపు తీయగానే ఆ కుక్క ముందుకు వెళ్తుంది. అప్పటి వరకు అడ్డేమీ లేకపోయినా... పాత అలవాటు ప్రకారం అక్కడ అద్దం ఉందనే భావనలోనే ఆ కుక్క అక్కడే ఉండిపోతుంది.  

ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ..  ‘మన అలవాట్లు చివరకు మనకు ఎలా వ్యసనంగా మారుతుందో వివరించడానికి ఇంతకు మించిన ఉదాహారణ లేదు. ఈ రోజుల్లో వ్యాపారంలో అతి ముఖ్యమైన నైపుణ్యం ఏంటంటే.. అలవాటైన మూస పద్దతిని బద్దలుకొట్టి స్వేచ్ఛగా ఆలోచించడం అంటూ అద్భుతమైన సలహా ఇచ్చారు.  
 

చదవండి:Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్‌ వస్తేనా..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అంబానీ యాంటిలియాలో ఫుట్‌బాల్ లెజెండ్ 'బెక్‌హామ్‌' - ఫోటోలు వైరల్

ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్!

మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ

బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?

దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్