More

Karvy scam:కార్వీ కేసులో పార్థసారథి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

25 Sep, 2021 13:52 IST

సాక్షి,హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.పార్థసారథికి భారీ షాక్‌ తగిలింది. కార్వీకి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం ఫ్రీజ్‌ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల షేర్లు ఫ్రీజ్‌ చేశారు. రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోజురోజుకు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్‌ చేసింది.

సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి అధికారులు..వీటితో పాటు ఎండీ పార్ధసారథి ఆస్తుల జప్తు, ఇద్దరు కుమారుల ఆస్తుల్ని ఈడీ అధికారులు ఫ్రీజ్‌ చేశారు.  కాగా, ఇటీవల కార్వీలో భారీ కుంభకోణం వెలుగులోకి  వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్‌ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ ఇప్పటికే కార్వీ చైర్మన్‌ సి.పార్థసారథిని విచారించింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!

పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

పండుగపూట పడిపోయిన పసిడి.. స్థిరంగా వెండి - కొత్త ధరలు ఇలా!

ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్

కంగుతిన్న ఐటీ ఉద్యోగి : 5,000 ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకుంటే..