More

Gaganyaan Mission: గగన్‌యాన్‌ మిషన్‌ లాంచ్‌పై స్పష్టత..!

16 Sep, 2021 19:34 IST

భారత్‌ మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్‌యాన్‌ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.  మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా గగన్‌యాన్‌ మిషన్‌పై కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్‌ స్పందించారు. 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో గగన్‌యాన్‌ మిషన్‌ను ప్రయోగిస్తామని జీతేంద్ర సింగ్‌ బుధవారం రోజున వెల్లడించారు.
చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్‌టెల్ శుభవార్త!

తొలుత గగన్‌యాన్‌ మిషన్‌ను 2022లో లాంచ్‌ చేయాలని ఇస్రో భావించగా కరోనా రాకతో మిషన్‌ ముందడుగు వేయలేదన్నారు. ఫిక్కి నిర్వహించిన ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా స్పేస్‌ టెక్నాలజీ పార్టనర్‌షిప్‌పై జరిగిన వెబినార్‌లో కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్‌ తెలిపారు. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ ప్రాముఖ్యత ఎంతగానో ఉందన్నారు. గగన్‌మిషన్‌ ద్వారా భారత వ్యోమగాములను లో ఎర్త్‌ ఆర్బిట్‌ చేర్చనుంది. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం వాడే లిక్విడ్‌ ప్రోపెలెంట్‌ వికాస్‌ ఇంజన్‌ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
చదవండి: SpaceX Inspiration4: బ్రాన్సన్‌, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్‌.. స్పేస్‌ ఎక్స్‌ పెనుసంచలనం, ఇదీ అసలైన ఛాలెంజ్‌!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పండుగపూట పడిపోయిన పసిడి.. స్థిరంగా వెండి - కొత్త ధరలు ఇలా!

ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్

కంగుతిన్న ఐటీ ఉద్యోగి : 5,000 ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకుంటే..

కేంద్రం కీలక నిర్ణయం, పాన్‌ - ఆధార్‌ లింక్‌ చేశారా?

‘స్ట్రెస్‌’ నుంచి బయట పడేందుకు ఎలాన్‌ మస్క్‌ చేసే పని ఇదా!