More

పసిడి పరుగుకు బ్రేక్‌

30 Sep, 2020 18:07 IST

ముంబై : బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు బుధవారం భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లో మెటల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 409 రూపాయలు తగ్గి 50,272 రూపాయలకు పడిపోగా, కిలో వెండి ఏకంగా 1700 రూపాయలు పతనమై 60,765 రూపాయలు పలికింది.

గతనెలలో బంగారం ఆల్‌టైమ్‌ హై తాకినప్పటి నుంచి ఇప్పటివరకూ 6000 రూపాయలు దిగివచ్చింది. ఇక డాలర్‌ బలపడటం, అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్‌ ప్రకటించవచ్చనే సంకేతాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్‌గోల్డ్‌ 0.1 శాతం తగ్గి ఔన్స్‌ 1896 డాలర్లకు పడిపోయింది. బంగారం, వెండి ధరలు మరికొద్ది రోజులు ఒడిదుడుకులతో సాగవచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : రూ. 50,000 దిగువకు బంగారం 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పెట్రోల్‌ బంకుల వద్ద క్యూ.. ఇకపై ఆ టెన్షన్‌ అవసరం లేదు

ఏకంగా 45000 కోట్లు.. డేటా సెంటర్లలోకి పెట్టుబడుల వరద

సాక్షి మనీ మంత్ర : ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌లో దేశీ సంస్థల హవా

సెమీకండక్టర్ల రంగంలో.. భారత్‌ అవకాశాల గని