More

Jay Y Lee శాంసంగ్‌కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు

28 Oct, 2022 11:09 IST

శాంసంగ్‌ చైర్మన్‌గా లీ జే-యాంగ్‌ నియామకం 

సియోల్‌: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌లో మూడో తరం వారసుడు లీ జే–యాంగ్‌ (54) చైర్మన్‌ పగ్గాలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన అధికారికంగా నియమితులైనట్లు కంపెనీ వెల్లడించింది. (Elon Musk ట్విటర్‌ డీల్‌ డన్‌: మస్క్‌ తొలి రియాక్షన్‌)

శాంసంగ్‌ వ్యవస్థాపకుడైన లీబియుంగ్‌-చుల్‌ మనవడైన జే-యాంగ్‌ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌–హైకి లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో అరెస్టయ్యారు. గతేడాది ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. రెండు నెలల క్రితమే ఆయనకు అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడంతో శిక్ష నుంచి విముక్తి లభించినట్లయింది. 2014లో ఆయన వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. (Hero MotoCorp ఫిలిప్పైన్స్‌లో  హీరో మోటోకార్ప్‌ ఎంట్రీ, కీలక డీల్‌ )

2020లో ఆయన తండ్రి లీ కున్‌-హీ మరణించినప్పటికీ కేసుల కారణంగా జే-యాంగ్‌ను చైర్మన్‌గా నియామకం సాధ్యపడలేదు. తాజాగా ఆయనకు క్షమాభిక్ష లభించడంతో చైర్మన్‌గా నియమించేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితితో టెక్నాలజీ డివైజ్‌ల కొనుగోళ్లు మందగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని సమర్ధంగా ముందుకు నడిపించడం జే-యాంగ్‌ ముందున్న ప్రధాన సవాలు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్థిరంగా బంగారం.. రూ.500 తగ్గిన వెండి - కొత్త ధరలు ఇలా!

యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!

ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?

చాట్‌జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్‌ఏఐ.. కారణం ఇదే!

200 బిలియన్‌ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..