More

సోదరుడికి సుపారీ ఇచ్చి.. కొడుకుని చంపించి

2 Jan, 2021 12:05 IST
మృతదేహాన్ని వెలికితీస్తున్న పోలీసులు

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి కర్కశంగా ప్రవర్తించింది. తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడని కన్న కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ సంఘటన వికారాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. వికారాబాద్‌, కోహ్లీ ప్రాంతానికి చెందిన శివప్రసాద్‌ అనే మైనర్‌ బాలుడు తాగొచ్చి ప్రతి రోజు తల్లిని వేధింపులకు గురిచేస్తున్నాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేకపోయిన తల్లి అతడ్ని చంపాలని నిశ్చయించుకుంది. సోదరుడితో కలిసి కుమారుడి హత్యకు పథకం రచించింది. ( ‘రంగరాయ’లో దొంగాట)

ఇందుకోసం సోదరుడికే సుపారీ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం శివ ప్రసాద్‌ మేనమామ అతడి గొంతుకు టవల్‌ బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని నీళ్లులేని బావిలో పూడ్చిపెట్టాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బావిలో శివ ప్రసాద్‌ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతుడి తల్లి,మేనమామల విషయం వెలుగుచూసింది. దీంతో వికారాబాద్‌ పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కళ్లెదుటే కన్నపేగు ఛిద్రం

షార్ట్‌ సర్క్యూట్‌.. రసాయనాలు '9 ప్రాణాలు బుగ్గి'

దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!

పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం!

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..