More

అజయ్‌తో ప్రేమ.. ఐదు నెలల క్రితమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. సడెన్‌గా

6 Apr, 2022 21:20 IST
అఖిల(ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం గ్రామానికి చెందిన వివాహిత సూర అఖిల(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అఖిల, అదే గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకుంది. ఇటీవల అఖిల అనారోగ్యానికి గురైందని అజయ్‌ ఆమెను ఎంజీఎంలో చేర్పించాడు.

చికిత్స పొందుతున్న అఖిల మంగళవారం మృతి చెందింది. అయితే కూతురు అలా అకస్మాత్తుగా చనిపోవడంపై వివాహిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అఖిలను అజయ్, అత్తామామలు వేధించి చంపి ఉంటారని ఆమె తండ్రి దయాసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. 
చదవండి: ఒకరితో పెళ్లి‍.. ఇద్దరితో వివాహేతర సంబంధం.. వీడిన హత్యకేసు మిస్టరీ

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫైర్‌ క్రాకర్స్‌తో  బైక్‌పై డేంజరస్‌ స్టంట్స్‌: గుండెలదిరిపోయే వీడియో వైరల్‌

టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు

అయ్యో.. ఎంత పనైంది.. ఐదు నిమిషాలు అత్తారింట్లో ఉన్నా ప్రాణాలు దక్కేవి!

కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి

'పార్ట్‌ టైం జాబ్‌' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..