More

టిక్‌టాక్‌.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు

2 Mar, 2023 06:21 IST

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్‌ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ అధినేత కార్మాక్‌ కీనన్‌ బుధవారం ప్రకటించారు.

గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్‌ ఎంటర్‌ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘గాడ్‌ డిపార్ట్‌మెంట్‌’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?

హమాస్‌ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?

అమెరికా ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన రుక్మిణి విజయకుమార్

పాలస్తీనియన్లకు ఫ్రాన్స్‌ న్యాయవాది భరోసా!

గాజాపై హమాస్‌ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్‌