More

WHO: రెమ్‌డెసివర్‌ను కరోనా చికిత్సకు వాడొద్దు

20 May, 2021 18:36 IST

జెనీవా: కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇక భారత్‌లోనూ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని.. కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్‌ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలో, పలు రాష్ట్రాల్లో  రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తుంది.  
చదవండి: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్‌ తీసుకోవద్దు 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్‌ కోవిడ్‌ ముప్పు!

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

కోవిన్‌ పోర్టల్‌.. ఫుల్‌ సేఫ్‌

COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌

పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు