More

Allu Arha Birthday: ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై అర్హ బర్త్‌డే వేడుకలు

21 Nov, 2021 19:49 IST

Allu Arjun And Sneha Celebrates Arha 5th Birthday At Burj Khalifa: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ నేడు(నవంబర్‌ 21) ఆరో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు బన్నీ. ఇందుకోసం ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫాను ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు. బుర్జ్‌ ఖలీపాపై అర్హతో కేక్‌ కట్‌ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ఈ భవంతిపై ఈ రేంజ్‌లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే! క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

భర్తకు స్పెషల్‌గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!

దీపావళి గ్లామర్ ట్రీట్.. ఒకరు క్యూట్ మరొకరు సూపర్ హాట్!

ఇండియాలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ఇదే!

'మంగళవారం'లో జీరో ఎక్స్‌పోజింగ్... చివరి 45 నిమిషాలు మాత్రం!

పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!