More

Allu Arjun: జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ అదే..!

13 Feb, 2023 21:03 IST

ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్ బాద్‌షా.  ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్‌లో  జవాన్‌ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్‌లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్‌ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.   అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 

జవాన్‌లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట‍్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్  ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!

స్లిమ్ అయిపోయిన సురేఖావాణి.. అషూరెడ్డి అలాంటి లుక్‌!

చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్‌ పంచుకున్న విశేషాలు

తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

‘శాంతల’చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: వెంకయ్య నాయుడు