More

Rahul Sipligunj : ఆటో నడిపిన బిగ్‌బాస్‌-3 విన్నర్‌ రాహుల్‌.. వీడియో వైరల్‌

21 Dec, 2021 16:27 IST

Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్‌ ముంబై వెళ్లాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎంతగానో పాపులర్‌ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్‌ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్‌ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?

బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్‌.. ఆమెతో కలిసి గృహప్రవేశం

మై లవ్‌ ఈజ్‌ గాన్‌, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్‌

బ్రేకప్‌కు ఎండ్‌ కార్డ్‌.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్‌