More

క్రాక్‌ పెద్ద హిట్‌ కావాలి

2 Jan, 2021 01:04 IST
బి.మధు, గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడి

– అనిల్‌ రావిపూడి

‘‘థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘క్రాక్‌’ సినిమాలోని అందరూ నాకు బాగా కావాల్సిన వారే.. రవితేజ, గోపి అన్న, మధుగార్లకు ఈ సినిమా గుర్తుండిపోయేంత పెద్ద హిట్‌ కావాలి’’ అని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు.

జనవరి 9న  విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.  గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ–‘‘మేం అడగ్గానే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన వెంకటేష్‌గారికి థ్యాంక్స్‌. ఒక మంచి కథకి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసర్‌.. అన్నీ కుదిరిన సినిమా ‘క్రాక్‌’. రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి కొంచెం ముందుగానే వస్తోంది’’ అన్నారు.  చిత్ర నిర్మాత బి.మధు, నిర్మాత సునీల్‌ నారంగ్, సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు, రచయిత వివేక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బిగ్‌ బాస్‌కు ముందే SPY బ్యాచ్‌ స్టార్ట్‌ అయిందా.. వీడియో వైరల్‌

పరారీలో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌!

ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఆ పొరపాటు చేయడంతో..

‘సలార్‌’ టికెట్‌ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి

దుబాయ్‌లో గామా అవార్డ్స్‌