More

Ullas Pandalam wife Suicide: ప్రముఖ హాస్యనటుడి భార్య ఆత్మహత్య..!

20 Dec, 2022 14:32 IST

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు ఉల్లాస్ పండళం భార్య ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లా పండలంలోని వారి నివాసంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన భార్య ఆశా(38) కనిపించడం లేదని ఉల్లాస్ కేరళ పోలీసులకు సమాచారమిచ్చాడు. 

సమాచారం అందుకున్న కేరళ పోలీసులు అతని నివాసానికి వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆశా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయే ముందు రోజు మొదటి అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అసలు ఉల్లాస్ పండళం ఎవరు?: ఉల్లాస్ పండళం మాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడు. అతని ప్రదర్శనలతో సినిమాలలో ఫేమస్ అయ్యారు. ఉల్లాస్ మమ్ముట్టి నటించిన 'దైవతింటే సొంతం క్లీటస్'తో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా అతను 'ఇతు తాండ పోలీస్', 'కాముకి', 'మన్నార్ మత్తై స్పీకింగ్ 2', 'హాస్యం' లాంటి పలు చిత్రాలలో కూడా నటించాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద సినిమాలు, స్ట్రీమింగ్‌ అక్కడే!

హీరోగా మారిన న్యాయవాది.. సినిమా రిలీజయ్యేది అప్పుడే!

రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్‌

దిశా పటానిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

‘సౌండ్‌ పార్టీ’ మూవీ రివ్యూ