More

Aishwarya Lakshmi : ఒకేసారి తండ్రీకొడుకులతో నటించా.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను

4 Dec, 2022 09:02 IST

తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి. గార్గి చిత్రంతో నిర్మాతగానూ మారిన ఈ మలయాళి బ్యూటీ కోలీవుడ్‌లో విశాల్‌ హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తరువాత ధనుష్‌ జంటగా జగమే తందిరం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ త్రంలో నటింంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో ఈమె నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది.

కుస్తీ పోటీల్లో తన నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు మలయాళ సపర్‌స్టార్‌ మమ్ముట్టీ అంటే చాలా ఇష్టమన్నారు. ఆయన నటనను చూస్తూ పెరిగినట్లు పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న క్రిస్టోఫర్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తాను నటించడం మరిపోలేని అనుభవమని తెలిపింది. మరో విషయం ఏమిటంటే నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా కింగ్‌ ఆఫ్‌ గోదా చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నట్లు పేర్కొంది. ఇలా ఒకేసారి తండ్రీకొడుకులతో నటించడం అరుదైన అనుభవంగా పేర్కొంది. ఈ ఏడాది తాను జీవితంలో గుర్తుండిపోయిందని సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రతిక పెట్టిన చిచ్చు.. మీదపడి మరీ అరుచుకున్న ఆ ఇ‍ద్దరు!

నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!

అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!

స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!

'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్!