More

Rakula Preet Singh: అలాంటి ప్రేమకథ చిత్రాలు చేయాలనుంది

29 Jul, 2022 11:12 IST

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీగా ఉన్నారు. ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇన్నేళ్లల్లో ఓ నలభై సినిమాల వరకూ చేశారామె. అయితే ఇప్పటివరకూ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించలేదు అంటున్నారు రకుల్‌. ఎలాంటి సినిమాలు చేయాలని ఉందో రకుల్‌ చెబుతూ.. ‘‘సౌత్‌లో నేను డిఫరెంట్‌ సినిమాలు చేశాను. కానీ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదు. నాకు రొమాంటిక్‌ లవ్‌స్టోరీస్‌ అంటే ఇష్టం.

‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘జబ్‌ వియ్‌ మెట్‌’, ‘ఏ జవానీ హై దీవానీ’ వంటి లవ్‌స్టోరీస్‌ చేయాలని ఉంది. అలాగే బయోపిక్‌లో నటించాలని ఉంది. అయితే ప్రత్యేకంగా ఫలానా ప్రముఖుల బయోపిక్‌ అని పేర్లు చెప్పలేను. ఇతరులకు స్ఫూర్తి కలిగించేవారి జీవితాల్లో నటించడం బాగుంటుంది. అందుకే అవకాశం వస్తే ఎవరి బయోపిక్‌ అయినా చేస్తా. ఇంకా చారిత్రక చిత్రంలో నటించాలని ఉంది’’ అన్నారు. మరి.. రకుల్‌ కోరుకున్నట్లు ప్యూర్‌ లవ్‌స్టోరీ, బయోపిక్, హిస్టారికల్‌.. ఈ మూడు తరహా చిత్రాల్లో నటించే అవకాశం వస్తుందా అనేది కాలమే చెబుతుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. కారణం ఇదేనా?

స్టేజీపై ఇద్దరు హీరోల ముద్దులాట, వీడియో చూశారా?

బిగ్‌ బాస్‌: బాత్రూంలో లేడీ కంటెస్టెట్స్‌ రచ్చ.. పురుషులు నచ్చరంటూ..

డాక్టర్‌గా మారిన హీరోయిన్‌... సినిమాలకు గుడ్‌బై?

చిన్న సినిమాలను చులకన చేసిన విశాల్‌.. దర్శకుడి కౌంటర్‌..