More

చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సల్మాన్‌ ఖాన్‌

10 Jan, 2021 11:09 IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నిజంగా చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. అది కూడా ఆయన కోసం కాదు.. ఓ అమ్మాయి కోసం. ఇంతకీ విషయం ఏంటంటే.. హిందీ‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 14కు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్‌ జాస్మిన్‌ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఆమె గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్లు అభినవ్‌ శుక్లా, జాస్మిన్‌లలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. దీంతో సల్మాన్‌ భావోద్వేగానికి‌ లోనయ్యారు. చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు. ( సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ మామూలుగా లేదు )

ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఆయన కంటతడి పెట్టుకునే దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ దీనిపై స్పందిస్తున్నారు. ‘‘ఓ సూపర్‌ స్టార్‌ కెమెరా ముందు కంటతడి పెట్టడం ఇదే ప్రథమం’’.. ‘‘ బిగ్‌బాస్‌‌ చరిత్రలో మొదటిసారి ఓ కంటెస్టెంట్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ ఏడ్చారు’’.. ‘‘ సల్మాన్‌ ఖాన్‌ తన కోసం కాకుండా ఇతరుల కోసం ఏడ్వటం నేను మొదటి సారి చూస్తున్నా’’ అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఈమె తెలుగు హీరోయిన్, ఆ విలన్‌తో ప్రేమ-త్వరలో పెళ్లి.. గుర్తుపట్టారా?

యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!

రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్ అలా.. రష్మిక ఏమో చీరలో ఇలా!

అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్

భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!