More

కాంబినేషన్‌ రిపీట్‌?

13 Sep, 2020 02:46 IST

షారుక్‌ ఖాన్‌ – కాజోల్‌ అప్పట్లో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ జోడీ. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌ కుచ్‌ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మైనేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ వంటి బాక్సాఫీస్‌ హిట్స్‌లో ఈ ఇద్దరూ  నటించారు. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌ – దీపికా పదుకోన్‌ అలాంటి జోడీలా మారింది. ఈ ఇద్దరూ ఆల్రెడీ ‘ఓంశాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్‌’ సినిమాల్లో కనిపించారు. తాజాగా షారుక్‌ ఖాన్‌ చేయబోతున్న రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ నటిస్తారని టాక్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో చేయబోతున్న ‘పఠాన్‌’, తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న ‘సంకీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లోనూ కథానాయికగా దీపిక పేరునే పరిశీలిస్తున్నారట. మరి ఈ ఇద్దరూ మళ్లీ జంటగా నటిస్తే... ముందు సినిమాల మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తారా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పండగ పోస్టర్‌ గురూ 

Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!

భర్తకు స్పెషల్‌గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!

దీపావళి గ్లామర్ ట్రీట్.. ఒకరు క్యూట్ మరొకరు సూపర్ హాట్!

ఇండియాలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ఇదే!