More

Manchu Vishnu: మంచు విష్ణు మూవీకి సరికొత్త టైటిల్‌, ప్రకటించిన టీం

11 Jun, 2022 08:14 IST

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమాకి ‘జిన్నా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విష్ణు కెరీర్‌లో ఇది 19వ చిత్రం. డా. మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవరామ్‌ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

టైటిల్‌ని కూడా వెరైటీగా రివీల్‌ చేశారు. సునీల్, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు, అనూప్‌ రూబెన్స్‌, ఈషాన్‌ సూర్యతో కలిసి విష్ణు సరదాగా చిట్‌ చాట్‌ చేస్తూ, ఫైనల్‌గా ‘జిన్నా’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్‌ పాత్ర చేస్తున్నారు విష్ణు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ ప్లే, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ వ్యవహరిస్తుండగా సంగీతం అనూప్‌ రూబెన్స్ అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?

Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్‌ టాప్-5 వాళ్లే!?

Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?

సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

'టైగర్ 3'లో అదంతా అబద్ధమే.. ఇదో కొత్తరకం మోసం!