More

85,362 కొత్త కేసులు, 1,089 మంది మృతి

26 Sep, 2020 09:37 IST

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 చేరుకున్నాయి. అలాగే యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది. కరోనా వైరస్‌తో దేశంలో మొత్తం 93,379 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,02,69,975 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇక దేశంలో 10 రాష్ట్రాల నుంచే 74 శాతం రికవరీలు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా కొత్త కేసుల్లో 75 శాతం కూడా పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని పేర్కొంది.  (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్‌ కోవిడ్‌ ముప్పు!

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

కోవిన్‌ పోర్టల్‌.. ఫుల్‌ సేఫ్‌

COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌

పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు