More

సెప్టెంబర్‌ 7కు హైదర్‌నగర్‌ భూముల కేసు వాయిదా

26 Aug, 2022 10:38 IST

సాక్షి, న్యూఢిల్లీ : హైదర్‌నగర్‌ భూములకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. హైదర్‌నగర్‌ సర్వే నంబర్‌ 172లోని 98 ఎకరాల భూమి తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

పిటిషన్‌లో లోపాలుంటే సరిచేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ గోల్డ్‌స్టోన్‌ ఎక్స్‌పోర్ట్స్, ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు

మూడేళ్లు ఏం చేసినట్లు?

కొలీజియం సిఫార్సుల అమలేదీ?

Rajasthan Election 2023: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి

Rajasthan Elections 2023: స్టయిల్‌ మారింది!