More

రజనీ కొత్త పార్టీ: కర్ణాటక కాంగ్రెస్‌ కామెంట్లు

5 Dec, 2020 16:18 IST

సాక్షి, బెంగళూరు :  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాను అతి త్వరలో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్‌ వేదికగా గత గురువారం ప్రకటించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులు కూడా శరావేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రజనీ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ‘‘ రజనీకాంత్‌ పార్టీ ఇంకా రిజిస్ట్రర్‌ కాలేదు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు ఏంటో తెలియదు.

అసలు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడో లేక పొత్తు పెట్టుకుంటాడో స్పష్టత లేదు. అతడు ఏం చేయబోతున్నాడో కూడా తెలియదు. దీనిపై స్పష్టత వస్తేనే రజనీ ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఎంత ఉంటుందో చెప్పగలం. చాలా మంది బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. రజనీ బీజేపీతో కలుస్తాడో లేదో ఏం చేస్తాడో చూడాలి’’ అని అన్నారు. ( రజనీ‌ పొలిటికల్‌ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు )

అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీకి సిద్ధం
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో రజనీకాంత్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, 234 సీట్లలో పోటీ చేస్తామని రజనీ సలహాదారు మణియన్ ప్రకటించారు. సరికొత్త రాజకీయాలకు రజనీకాంత్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈనెల 31న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్‌’

ICC World Cup 2023: ఒక రోజు హోటల్‌ అద్దె లక్షన్నర

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు

మీటింగ్‌ అయ్యాక గిటార్‌ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్‌ ‘ట్యూన్‌’

భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ