More

పార్టీ నాయకుడిపై లాలు యాదవ్‌ కొడుకు ఫైర్‌.. సమావేశం మధ్యలోనే...

9 Oct, 2022 20:15 IST

న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్‌ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు.

ఈ విషయమై తేజ్‌ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు.

తాను సమావేశం షెడ్యూల్‌ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్‌ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు  కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. 

(చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్‌’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కస్టమర్లకు అలర్ట్‌: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు

డీప్‌ఫేక్‌తో భారత్‌కు ముప్పు: మోదీ

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ

విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!