More

పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్‌

10 May, 2021 06:54 IST

పుదుచ్చేరి:పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి కరోనా బారినపడ్డారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన విధుల్లో చేరారు. తాజాగా జ్వరం రావడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని.. పాజిటివ్‌గా తేలడంతో  సోమవారం చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనతో సఖ్యతగా మెలిగిన ఎమ్మెల్యేలకు కూడా సోమవారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కారణంగా ఈనెల 14వ తేదీన జరగాల్సిన మంత్రుల పదవీ ప్రమాణం కార్యక్రమం వాయిదాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే కరోనా కష్టకాలంలో పనిచేయాల్సి ఉన్నందున సీఎం ఆశీస్సులతో ఆదేరోజున ఉప ముఖ్యమంత్రి సహా నలుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అలాగే, అరియలూరు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి శివశంకర్‌కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.  
చదవండి: 
రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి
కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!

రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఘనంగా ఏర్పాట్లు 

సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్‌లో చాయ్‌ ఫ్రీ!

లౌడ్‌ ‍స్పీకర్లు బ్యాన్‌.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!

Dec 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌