More

మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్‌ కేసులు

14 Mar, 2022 20:48 IST

పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి.

ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్‌లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్‌లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్‌లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్‌ డోస్‌ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్‌లు, 7.68 మిలియన్లు రెండవ డోస్‌లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్‌లు వేశారు.

(చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Rajasthan: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఇది అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌: నడ్డా

సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్‌ క్లారిటీ

సుబ్రతారాయ్‌ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?

రాజస్థాన్‌ ఎన్నికలపై పాక్‌ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయం