More

‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్’

15 Oct, 2020 13:11 IST

ఇలా చేస్తే డబ్బులు ఆదా.. కాలుష్యం తగ్గుతుంది

వాయు కాలుష్యంపై పోరుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఉద్యమం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రివాల్‌ ప్రభుత్వం కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గురువారం ‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్‌’  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘‘వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్’ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఢిల్లీలో దాదాపు ఒక కోటి వాహనాలు నమోదై ఉన్నాయి. ( అన్ని విధాలా సాయం అందిస్తాం )

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర కనీసం 10 లక్షల వాహనాలు ఇంజన్స్‌ను ఆఫ్‌ చేస్తే.. ప్రతీ ఏటా 1.5 టన్నుల ‘పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ 10’ తగ్గుతుంది. ఇందుకోసం మనమందరం ఈ రోజే ప్రతిన బూనాలి. సిగ్నల్స్‌ దగ్గర మీరు మీ వాహనాల ఇంజన్స్‌ను ఆఫ్‌ చేస్తే మీకు డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా వాయు కాలుష్యం తగ్గుతుంద’’ని అన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

‘కాంగ్రెస్‌ మళ్లీ వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు’

ఢిల్లీ వాసులకు అలర్ట్!

ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత 

400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!