More

ఉత్తర కాశీ దుర్ఘటన.. 27కు చేరిన మృతులు

10 Oct, 2022 06:54 IST

ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరింది. ఘటనాస్థలిలో ఆరు రోజులుగా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్న సిబ్బంది ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ నెల 4వ తేదీన 17 వేల అడుగుల ఎత్తులో మంచుచరియలు పడి విషాదం చోటు చేసుకుంది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెయినీరింగ్‌(ఎన్‌ఐఎం)లో శిక్షణ పొందుతున్న 27 మంది, ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లు ‘ద్రౌపదీ కా దండా–2’ శిఖరం నుంచి వెనుదిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 21 మృతదేహాలను గుర్తించి, సంబంధీకులకు అధికారులు అందజేశారు. మరో ఇద్దరు ట్రైనీల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌ఐఎం పేర్కొంది.

ఇదీ చదవండి: Bharat Jodo Yatra: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్‌ బంద్‌, పలు రైళ్లు రద్దు

వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట

కశ్మీర్‌లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత

భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు 

టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి