More

ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం

27 Sep, 2020 03:15 IST

చండీగఢ్‌: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్‌లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్‌డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సివచ్చిందన్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఈనెల 16న బీజేపీ మేనిఫెస్టో.. కీలక హామీలు ఇవే!

ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?

బాబుది గ్రాఫిక్స్‌ ప్రపంచం.. రేవంత్‌ది భ్రమల లోకం

కాంగ్రెస్‌కి అసలా అవకాశమే ఇవ్వకూడదన్నది బీజేపీ పంతం

Nov 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌