More

Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ

25 Jan, 2023 15:24 IST
సానియా మీర్జా- రోహన్‌ బోపన్న (PC: Australia Open)

Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్‌ బోపన్న (భారత్‌) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్‌ మ్యాచ్‌లో థర్డ్‌ సీడ్‌ ద్వయం నీల్‌ స్కుప్స్కి(గ్రేట్‌ బ్రిటన్‌), డిసిరే(యూఎస్‌ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది.

అలా సెమీస్‌కు చేరి..
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్‌ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు.

ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.  కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

చదవండి: ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా సిరాజ్‌
ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్‌.. హిట్‌మ్యాన్‌ ఏ స్థానంలో ఉన్నాడంటే..?

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌

IND VS NED: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క

తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీసిన విరాట్‌.. ఏకంగా కెప్టెన్‌కే ఝలక్‌

భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్‌ బౌలర్‌, చెత్త రికార్డు

టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్‌కప్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌