More

Denmark Open: తొలి రౌండ్‌లోనే సైనా ఇంటిముఖం

21 Oct, 2021 07:49 IST

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో రెండో రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో 16–21, 14–21తో అయా ఒహోరి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... సౌరభ్‌ వర్మ, కశ్యప్, ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. లక్ష్య సేన్‌ 21–9, 21–7తో సౌరభ్‌ వర్మ (భారత్‌)పై నెగ్గగా... ప్రణయ్‌ 18–21, 19–21తో జొనాథాన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. చౌ తియె చెన్‌ (చైనీస్‌ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్‌ తొలి గేమ్‌లో 0–3తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు.

చదవండి: భారత్‌ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం 

సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్‌ అడ్డుకట్ట వేయగలదా..?

CWC 2023: బంగ్లాదేశ్‌కు లక్కీ ఛాన్స్‌