More

Chris Cairns: వెంటిలేటర్‌పై న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌

10 Aug, 2021 15:03 IST

సిడ్నీ: న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. గుండె లోపల నీరు చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అతని కుటుంబసభ్యులు రెండురోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించి ఆపరేషన్లు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

కాగా 51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్‌ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC 2023: వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. క్వింటన్‌ డికాక్‌

సచిన్‌, వినోద్‌ కాంబ్లేల స్నేహం.. సినిమా ప్లాన్‌ చేస్తున్న ‍స్టార్‌ డైరెక్టర్‌

Singapore Squash Open 2023: సౌరవ్‌ పరాజయం

ATP Finals 2023: చరిత్ర సృష్టించిన రోహన్‌ బోపన్న

పోరాడి ఓడిన ప్రణయ్‌