More

Grandmaster status: భారత 76వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్‌ ఆనంద్‌

17 Sep, 2022 04:54 IST

ఈ ఏడాది భారత్‌ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్‌ ఆనంద్‌ భారత్‌ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–16 విభాగంలో టైటిల్‌ సాధించిన ప్రణవ్‌ 2500 ఎలో రేటింగ్‌ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో ప్రణవ్‌ మూడో జీఎం నార్మ్‌ సాధించాడు. ఈ సంవత్సరం భరత్‌ సుబ్రమణియమ్‌ (తమిళనాడు), రాహుల్‌ శ్రీవత్సవ్‌ (తెలంగాణ), ప్రణవ్‌     వెంకటేశ్‌ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC 2023: కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన జడేజా

CWC 2023 IND VS NED: అజేయ భారత్‌.. అరుదైన ఘనత

CWC 2023: శ్రేయస్‌-రాహుల్‌.. జోడీ నంబర్‌ వన్‌

11 ఏళ్ల తర్వాత వికెట్‌ తీసిన హిట్‌మ్యాన్‌.. ఇదే మ్యాచ్‌లో కోహ్లి కూడా..!

టీమిండియాను ఓడించడం​ చాలా కష్టం: నెదర్లాండ్స్‌ కెప్టెన్‌