More

Harbhajan Singh: సరైన కారణం లేకుండా తొలగించారు.. ధోనిని అడుగుదామనుకున్నా

31 Dec, 2021 19:15 IST

టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ గతవారం అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా తరపున 103 టెస్టుల్లో 417 వికెట్లు, 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టి20ల్లో 25 వికెట్లు తీశాడు. తన 18 ఏళ్ల కెరీర్‌లో ఒక దశాబ్దం పాటు భజ్జీ టీమిండియా స్పిన్నర్‌గా కీలకపాత్ర పోషించాడు. కాగా రిటైర్మంట్‌ ప్రకటించిన హర్భజన్‌ తాజాగా తన మనసులోని మాటలు భయటపెట్టాడు. సరైన కారణం లేకుండానే తనను జట్టుకు దూరం చేశారని.. మరికొద్ది రోజులు ఆడి ఉంటే కచ్చితంగా మరో 100 వికెట్లు తీసేవాడినని పేర్కొన్నాడు. 

చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్‌

ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో భజ్జీ మాట్లాడుతూ..  ''టెస్టుల్లో 400వ వికెట్‌ తీసే సమయానికి నా వయసు 31 ఏళ్లు.  అప్పటికి నాలో మరో 9 ఏళ్లు క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. ఆ సమయంలో ఆడి ఉంటే కచ్చితంగా మరో 100 వికెట్లు కచ్చితంగా తీసేవాడిని. కానీ ఆ తర్వాత ఎందుకనో నాకు ఆడే అవకాశం రాకపోవడం.. సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం ఇలా కారణం ఏదైనా 400 వికెట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ నా ఆట అర్థంతరంగా ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. నేను జట్టులో ఉంటే ఎవరికి నష్టం ఉండేదో అర్థం కాలేదు. ఇదే విషయమై అప్పటి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని చాలాసార్లు అడుగుదామనుకున్నా. కానీ ధోని సరైన కారణం ఇవ్వడేమోనని మానుకున్నా. కానీ ఇప్పటికి నేను ఆటకు దూరమవ్వడానికి ఎవరు ఉన్నారో తెలియదు కానీ.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా'' అంటూ ముగించాడు.

ఇక హర్భజన్‌ టీమిండియా తరపున 2015లో గాలే వేదికగా శ్రీలంకతో ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఏడాది విరామం అనంతరం యూఏఈ వేదికగా జరిగిన టి20 ఆసియా కప్‌లో టీమిండియా తరపున ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 11 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశాడు. అంతే ఆ తర్వాత మళ్లీ హర్భజన్‌ జట్టులోకి రాలేకపోయాడు.

చదవండి: Virat Kohli: అందుకే కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌: మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పాకిస్తాన్‌ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి?

వెస్టిండీస్‌ టూర్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

IPL 2024: పృథ్వీ షాకు బిగ్‌ షాక్‌ ఇవ్వనున్న ఢిల్లీ..!

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?

చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్‌ ఆజం