More

Virat Kohli Dancing: మైదానంలో స్టెప్పులేసిన కోహ్లి.. నువ్వు సూపర్‌ భాయ్‌ అంటూ...

29 Dec, 2021 11:11 IST
PC: Twitter

Ind Vs Sa 1st Test- Virat Kohli: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తొలి రోజు కేఎల్‌ రాహుల్‌ అద్భుత సెంచరీ... ఆధిక్యం మనదే.. గెలుపు సులువే అంటూ అభిమానుల ఆనందం.. కానీ రెండో రోజు ఆట చూద్దామనుకుంటే వరుణుడు ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేశారు.. ఇక మూడో రోజైనా మనోళ్ల మెరుపులు చూడాలని భావించిన వాళ్లకు ఆరంభంలోనే తీవ్ర నిరాశ... లుంగి ఎన్గిడి, కగిసో రబడ దెబ్బ మీద దెబ్బ కొట్టారు. వరుసగా వికెట్లు కూల్చి 272 పరుగుల స్కోరు వద్ద ఆటను ఆరంభించిన భారత జట్టును 50 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్‌ చేశారు. 

పంత్‌, అశ్విన్‌, శార్దూల్‌, షమీ తదితరులు పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్‌ చేరారు. అయిపోయింది... అంతా అయిపోయింది అంటూ ఉసూరుమన్న అభిమానుల్లో.. సరిగ్గా అప్పుడే జోష్‌ నింపారు టీమిండియా బౌలర్లు. ప్రొటిస్‌ జట్టుకు చుక్కలు చూపిస్తూ... పదునైన బంతులు సంధిస్తూ వరుసగా వికెట్లు పడగొట్టారు. మరి వీరి అద్భుత ప్రదర్శన చూసిన అభిమానులకే కాదు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ముచ్చటేసినట్లుంది. అందుకే మైదానంలోనే స్టెప్పులేస్తూ... బౌలర్ల విజయాన్ని ఆస్వాదించాడు. 

ఆటను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తూ జట్టును ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘‘విరాట్‌ భాయ్‌... నువ్వు అందరిలాంటి కెప్టెన్‌ కాదు... ఎక్కడున్నా కింగ్‌వే. నీ దూకుడే కాదు.. ఆటను ఎంజాయ్‌ చేసే విధానం కూడా మాకు ఇష్టం. అందుకే నువ్వు ప్రత్యేకమైనవాడివి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసి... 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

చదవండి: Ind Vs Sa- Mohammed Shami: అంతా మా నాన్న వల్లే.. ఈ క్రెడిట్‌ ఆయనదే.. షమీ భావోద్వేగం
Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌

IND VS NED: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క

తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీసిన విరాట్‌.. ఏకంగా కెప్టెన్‌కే ఝలక్‌

భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్‌ బౌలర్‌, చెత్త రికార్డు

టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్‌కప్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌