More

Djokovic: వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదు.. బలవంతం చేస్తే మాత్రం..!

15 Feb, 2022 22:25 IST

కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకునేదే లేదని భీష్మించుకు కూర్చున్న వివాదాస్పద టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు  ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌కు తాను వ్యతిరేకం కాదని, బ‌ల‌వంతంగా తీసుకోమని ఒత్తిడి తెస్తే మాత్రం భ‌విష్య‌త్తులో జ‌రిగే టెన్నిస్ టోర్నీల‌కు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నానని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. 

ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే వింబుల్డ‌న్‌, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల‌ను వ‌దులుకుంటారా అని విలేకరులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. జోకో ఈ మేరకు స్పందించాడు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, వ్యాక్సిన్ వ్య‌తిరేక ఉద్య‌మానికి తానేమీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని ఈ సందర్భంగా జకో స్పష్టంగా చేశాడు. శ‌రీర ధ‌ర్మానికి త‌గ్గట్లుగానే త‌న నిర్ణ‌యాలు ఉంటాయ‌ని, ఈ విషయంలో తననెవరైనా బలవంతం చేస్తే ట్రోఫీలు వ‌దులుకోవ‌డం పెద్ద స‌మ‌స్య కాద‌ని తెలిపాడు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కార‌ణంగా ఈ సెర్బియన్‌ స్టార్‌ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ 2022కు దూర‌మైన సంగతి తెలిసిందే.
చదవండి క్రికెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు​.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

World Cup 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌ రాజీనామా

కోహ్లిని ఔట్‌ చేశాడు.. గిఫ్ట్‌ కొట్టేశాడు! వీడియో వైరల్‌

వరల్డ్‌కప్‌ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్‌

వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం.. మరో ఇద్దరి కూడా..!

CWC 2023: సిక్సర్ల టీమిండియా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను తలదన్ని..!