More

భగత్‌ సింగ్‌, వివేకానంద ఫోటోలకు ప్రాణం వస్తే...!

8 Mar, 2021 14:36 IST

మన పూర్వీకులు మనతో లేకపోయినా, వారి ఫోటోలను జ్ఞాపకాలుగా దాచుకుంటాం. మరి ఆ ఫోటోలకు హావభావాలు వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా..! ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా! ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ఏదైనా చేయవచ్చు. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) టూల్‌తో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ టూల్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. మై హెరిటేజ్‌ సంస్థ రూపొందించిన డీప్‌ నోస్టాల్జియా అల్గారిథంతో ఫోటోలకు హావభావాలను ఇవ్వొచ్చు.

భగత్‌ సింగ్‌, స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, కస్తూర్భా గాంధీ, పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలను కీర్తిక్‌ శశిధరణ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఫొటోల్లో స్వాతంత్ర్య సమర యోధుల హావభావాలు చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. వారి ఫోటోలను ఆన్‌లైన్‌లో తెగ షేర్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తాజా టూల్‌తో నెటిజన్స్‌ తమ పూర్వీకుల ఫొటోలకు ప్రాణం పోస్తున్నారు. వీడియోలను బంధువర్గంతో పంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్‌ప్రైజ్‌

అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు

కూరగాయల బాక్స్ అనుకొని వ్యక్తి ప్రాణం తీసిన రోబో..

కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ వాచ్‌

ప్రపంచంలో బడా భూస్వామి ఎవరు?