More

130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

1 Feb, 2021 20:15 IST

సాక్షి, హైదరాబాద్‌: ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన 130 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్‌ విక్రయాలకు పాల్పడిందని నిర్ధారణ కావడంతో ఈడీ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌)  కేసు నమోదైవుంది. దీనికి అనుబంధంగా ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కాగా, గతంలో ఇదే కేసుకు సంబంధించి 82.11 కోట్ల విలువైన 145 కేజీల బంగారాన్ని ఈడీ సీజ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!

TS Elections 2023: ఇంటి పెద్ద కోసం ఇంతైనా చేయకుంటే ఎలా..!?

'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!

ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన కేసీఆర్‌.. షెడ్యూల్‌ రాక ముందే అభ్యర్థుల ప్రకటన

కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!