More

భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర

23 Apr, 2022 03:05 IST

సీఎంను కలిసేందుకు బయల్దేరిన శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్‌గౌడ్‌(58) పాదయాత్ర ప్రారంభించాడు. ఫ్లెక్సీపై వివరాలు రాసి మెడకు తగిలించుకుని కాలినడకన మంచిర్యాల నుంచి శుక్రవారం బయల్దేరాడు. మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులో శ్రీనివాస్‌గౌడ్‌కు 15ఎకరాల భూమి ఉంది. 1992 వరకు పట్టా భూమిగా, తర్వాత లావుణి పట్టాగా పహానిలో నమోదైంది.

2016 భూ ప్రక్షాళనలో 15 ఎకరాలకు బదులు 13.2 ఎకరాలుగా 2018లో పాస్‌బుక్‌లు ఇచ్చారు. తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలుమార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఎండలో నడవడానికి వయసు సహకరించకున్నా రెవెన్యూ శాఖ తప్పిదాలను ఎత్తి చూపేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నాడు. ఈ విషయమై మందమర్రి ఎమ్మార్వో సంపతి శ్రీనివాస్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, గతంలోనే ఆయనకు అసైన్‌మెంటు కింద పట్టా జారీ అయిందని, ఇప్పుడు మార్చడం వీలుకాదని తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!

‘అందుకే 15 రోజుల్లో కుట్ర అంటూ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు’

నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..

సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు