More

జర్నలిస్టులకు పెన్షన్‌ స్కీం ప్రవేశపెట్టాలి 

13 Dec, 2022 04:46 IST

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్టు పెన్షన్‌ స్కీంను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని మహాజన సొషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖరాశారు. సమాజం కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్‌ స్కీం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

రైతుబంధు, దళితబంధు తరహాలో కులాలు, మతాల తారతమ్యం లేకుండా జర్నలిస్టుందరికీ జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలని విన్నవించారు. జీవో 239ను సవరించాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిన్న పత్రికల అప్‌గ్రేడ్‌ ప్రక్రియను వెంటనే చేపట్టి ఆయా పత్రికల మనుగడను ఆదుకోవాలని మందకృష్ణ విన్నవించారు. అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీలతో పాటు సొసైటీల్లో లేని జర్నలిస్టులకు కూడా ఇళ్లు కేటాయించాలన్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్‌ ర్యాలీలో అపశ్రుతి.. కేటీఆర్‌కు తప్పిన ముప్పు

ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాళ్లదాడి

నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్‌

రెండు చోట్ల నామినేషన్‌ వేసిన కేసీఆర్‌

కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్‌ కౌంటర్‌