More

నిర్మల్‌ కలెక్టర్‌ పై హైకోర్టు సీరియస్‌

9 Oct, 2020 17:36 IST

సాక్షి, నిర్మల్‌: జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ పై హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ పట్టణంలో ఉన్న  చెరువుల్లో చేపడుతున్న అక్రమాల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు కలెక్టర్‌ను ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశింది. కంచరోలి, ఇబ్రహీం ట్యాంక్‌ చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణలను  ఎందుకు అడ్డుకోవడం లేదో తెలపాలని కోర్టు కోరింది. కోర్టు చెప్పేది నాలుగవ తరగతి ఉద్యోగికి కూడా అర్థం అవుతుంది కానీ నిర్మల్ జిల్లా కలెక్టరుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సోమవారం అనగా అక్టోబర్‌ 12వ తేదీన వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తులు సోమవారంకు వాయిదా వేశారు. 

చదవండి: గో కార్టింగ్‌ ప్రమాదంపై కేసు నమోదు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు

ఇక్కడి బడి, గుడి నేను కట్టించినవే: రేవంత్ రెడ్డి

బీసీని బీజేపీ సీఎం చేయడం ఒక కల: తుల ఉమ

తుమ్మల చెప్పినట్టు చేస్తే రేవంత్‌రెడ్డి నామినేషన్‌ రిజెక్ట్‌ చేయాలి : పువ్వాడ