పల్నాడులో చంద్రబాబుకు షాకిచ్చిన కార్యకర్తలు

11 Sep, 2019 07:43 IST|Sakshi

గొడవలు సృష్టించేందుకు టీడీపీ నేతల కుట్ర

కఠిన చర్యలు తప్పవంటున్న డీజీపీ

సొంత గ్రామాలకు జారుకుంటున్న కార్యకర్తలు

సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో ప్రశాంతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తామకెలాంటి సమస్యలను లేవని అక్కడి ప్రజానీకం చెబుతున్నా.. కేవలం కుట్రపూరితంగా టీడీపీ నేతలు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పోలీసులు అధికారులు 144 సెక్షన్‌ అమలు చేశారు. తమ అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు చేయవద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ఆయన కోరారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సి​ద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.

సొంత గ్రామాలకు కార్యకర్తలు
మరోవైపు గుంటూరు జిల్లా ఆత్మకూరు వాతావరణం ప్రశాంతంగానే ఉందని డీఎస్పీ హరి తెలిపారు. గతంలో ఒకే కుంటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కేవలం కుటుంబ వివాదాలే అని తేల్చిచెప్పారు. వారి కుటుంబ గొడవలతో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. పోలీసుల ప్రకటనతో టీడీపీ పునరావాస ఉన్న పార్టీ కార్యకర్తలు చిన్నగా జారుకుంటున్నారు. తమను అడ్డంపెట్టకుని నేతలు రాజకీయం చేస్తున్నారని గమనించిన క్యాడర్‌.. తమ సొంత గ్రామాలకు తరలివెళ్లిపోతున్నారు. తమ కుటుంబ సమస్యలను రాజకీయ పార్టీల అవసరాలకు వాడుకుంటున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల వైఖరితో టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు.


నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్‌ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. (చదవండి: పల్నాట కపట నాటకం!)

మరిన్ని వార్తలు