2,200 రాకెట్లు.. ఒకేసారి

25 Apr, 2015 02:37 IST|Sakshi
2,200 రాకెట్లు.. ఒకేసారి

సీబీఐటీ, వీబీఐటీ విద్యార్థుల వినూత్న ప్రయోగం
వైఎస్‌ఆర్ జిల్లా చాపాడులోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (సీబీఐటీ), విజ్ఞాన  భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) కళాశాల విద్యార్థులు సంయుక్తంగా ఏక కాలంలో 2,200 ఎయిర్ రాకెట్లను ప్రయోగించారు.‘14 యంత్రాస్’ అనే సంస్థ చెన్నై ఐఐటీ, బెంగళూరు ఐఐఎం సహకారంతో  రూ. 25 లక్షల ఖర్చుతో 2,200 మంది విద్యార్థులతో ఎయిర్ రాకెట్లను తయారు చేయించింది. వాటిని సీబీఐటీ, వీబీఐటీ ప్రాంగణ ం వేదికగా ప్రయోగించారు. చైనాలో ఓ విద్యా సంస్థ 2011లో 1,056 మందితో ఇలాంటి ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డు సాధించగా, తాజా ప్రయోగం ఆ రికార్డును అధిగమించాయి. రాకెట్లు 100 అడుగుల ఎత్తుకు వెళ్లాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నాలజీపై విశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సీబీఐటీ, వీబీఐటి కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి చెప్పారు. గిన్నిస్ రికార్డు వారికి ఈ ప్రయోగ వివరాలు పంపుతామన్నారు.    
 - చాపాడు

మరిన్ని వార్తలు