400 అడుగుల భోగి పిడకల దండ

14 Jan, 2020 07:51 IST|Sakshi

సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగకు భోగి పిడకల దండలు వేయడానికి చిన్నారులు పోటీపడుతుంటారు. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా చెప్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం సమనస పంచాయతీ పరిధిలో రంగాపురంలో విశ్రాంత ఉపా«ధ్యాయుడు భూపతిరాజు విశ్వనాథరాజు కోడలు శ్రీరామసత్య 400 అడుగుల భోగి పిడకల దండ తయారు చేశారు. విశ్వనాథరాజు ఇంట్లోని గోమయం (ఆవు పేడ)తో ఈ దండను తయారు చేశారు. భోగి మంటలు వేయడంలో కొన్ని సైన్స్‌ సంబంధించిన అంశాలు ఉన్నాయని విశ్వనాథరాజు తెలిపారు.

దేశీయ గోమయం పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మ క్రిములు నశించి పాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుందని, ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి మంచిందన్నారు. రంగాపురంలో తొలిసారిగా చేసిన దండను చూడటానికి పలు గ్రామాల  ప్రజలు తరలివస్తున్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాన్ని ఈ తరం పిల్లలకు తెలియజేయాలని ఈ దండను చేశామన్నారు. 14 తేదీన భోగి పండగ రోజున పూజలు చేసి ఈ దండను భోగి మంటలో వేస్తామని సత్య తెలిపారు.

మరిన్ని వార్తలు