41 మంది జీవిత ఖైదీలకు విముక్తి

22 Dec, 2013 07:07 IST|Sakshi

సాక్షి, హన్మకొండ, వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు జైలు జీవితం నుంచి విముక్తి పొందారు. గాంధీ జయంతి సందర్భంగా వారిని విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం గతంలోనే అంగీకరించినప్పటికీ వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు సర్కార్ అనుమతి మేరకు 220 జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 390 మంది ఖైదీలు విడుదల కాగా... వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులుగా తేలారు. వీరందరినీ శనివారం విడుదల చేస్తున్నట్లు జైళ్ల శాఖ అధికారులు ప్రకటించారు.

ఈ మే రకు రాత్రి 12.30 గంటల సమయంలో 37 మంది జైలు నుంచి బయటకు వచ్చారు. మిగతా వారిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న కొమ్ము రాధ అనే మహిళను 20 రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. ఆమెతోపాటు నసీం ఖాన్, పిట్ల రాజేశ్వర్, ఎండీ.షాన్‌వాజ్ పెరోల్‌పై బయటనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నలుగురిని ఆదివారం ఉదయం జైలు నిబంధనల మేరకు కేంద్ర కారాగారంలో జైలు అధికారుల ఎదుట సరెండర్ అవుతారని, ఆ తర్వాత క్షమాభిక్ష కింద వారిని వెంటనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
 
 రెండున్నరేళ్ల తర్వాత...
 క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలను ముందుగానే గుర్తించి.. గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయడం ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో చివరిసారి 2011 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖైదీ లను క్షమాభిక్షపై విడుదల చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు. 2013 గాంధీ జయంతి సందర్భం గా కూడా ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలే కా కుండా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తారుు. దీంతో సర్కారు హడావుడిగా అక్టోబరు 1న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించింది. కానీ... నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడంతో గాంధీ జయంతి నాటికి క్షమాభిక్షకు  అర్హులైన ఖైదీల ఎంపిక  ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష ప్రకటన వెలువడిన తర్వాత జైళ్లశాఖ నియమ నిబంధనల ప్రకారం ఎంతమందికి క్షమాభిక్షకు అర్హులవుతారనే అంశాన్ని గుర్తించేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీ లు అర్హులుగా తేలింది. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అన్ని పరిశీలనలు పూర్తరుున తర్వాత శనివా రం రాత్రి వీరిని విడుదల చేశారు.
 
 సాక్షి కార్యాలయానికి లేఖలు
 ‘మేము వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలుగా వివిధ  సెక్షన్ల కింద జీవిత  ఖై దీలుగా శిక్ష అనుభవిస్తున్నాం. మేము విముక్తి కోసం ఇక్కడ జీవచ్ఛవాలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాం. తా ము చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతున్నాం. మాకు మరో జీవితాన్ని ప్రసాదించాలి. మా మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి’ అంటూ గతంలో సాక్షి కార్యాలయానికి వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలు పలు మార్లు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించే  గణతంత్ర, గాంధీజయంతి సందర్భంగా వీరి బాధలను ‘సాక్షి’ ప్రచురించిం ది. 60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు, 55 ఏళ్లు పైబడిన మహిళా ఖైదీల ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని  క్షమాభిక్షపై విడుదల చేయాలని కోరుతూ ఆగస్టు 11న వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు ఆమరణ దీక్ష కూడా చేపట్టారు.

మరిన్ని వార్తలు