42 ఎర్రచందనం దుంగల పట్టివేత

14 Mar, 2015 02:35 IST|Sakshi

గిద్దలూరు రూరల్: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్థానిక అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున బేస్తవారిపేట మండలం హనుమాయిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గిద్దలూరు రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఆర్‌ఓ షేక్ నజీర్‌బాషా తన సిబ్బందితో హనుమాయిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు.

రోడ్డుకు ఒక పక్క అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచిన 42 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గిద్దలూరు అటవీశాఖ కార్యాయానికి తరలిచారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దాడుల్లో ఎఫ్‌ఎస్‌ఓ హరిప్రసాద్, ఎఫ్‌బీఓలు ఓ.రామయ్య, టిప్పుఖాన్, మురళీకృష్ణ, రామకృష్ణ, ఏబీఓ ఎన్.రోజారమణి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు