అజ్మీర్‌ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే సాయి 

17 May, 2019 11:11 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రత్యేక ఫాతెహాలు   

దపుష్కర్‌ బ్రహ్మస్వామి ఆలయంలోనూ పూజలు

సాక్షి, ఆదోని టౌన్‌: రాజస్థాన్‌లోని  అజ్మీర్‌లో ఉన్న ఖాజా గరీబ్‌ నవాజ్‌ దర్గాను  గురువారం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకు లు, సన్నిహితులు  దర్శించుకున్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఖాజా గరీబ్‌ నవాజ్‌ దర్గాలో ఫాతెహాలు చేశారు. అదేవిధంగా   పుష్కర్‌లోని బ్రహ్మస్వామి దేవాలయాన్ని సాయి ప్రసాద్‌రెడ్డి బృందం దర్శించుకుంది.  స్వామివారికి పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలతో అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వామివారిని కోరినట్లు సాయి ప్రసాద్‌రెడ్డి ఫోన్‌లో తెలిపారు.     వారం రోజుల్లో వెలుబడే  ఎన్నికల  ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఈ సందర్భంగా సాయి  ధీమా  వ్యక్తం చేశారు.  120 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు  కైవసం చేసుకుంటామన్నారు.   సీఎం చంద్రబాబు శకం వచ్చే గురువారంతో ముగి యనుందని చెప్పారు.   
నీరజ్‌ డాంగిని కలిసిన సాయి 
రాజస్థాన్‌ రాష్ట్రం మాజీ హోంమంత్రి దినేష్‌ డాంగి తనయుడు, ప్రస్తుత రాజస్థాన్‌ పీసీసీ ప్రధాన కార్యదర్శి నీరజ్‌ డాంగిని జైపూర్‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితోపాటు  సన్నిహితులు మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌ రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మజార్‌ అహ్మద్, ఈషాబాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి  నీరజ్‌డాంగికి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు.

మరిన్ని వార్తలు